శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బంగారు విమానం గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షన మహోత్సవం సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు తమ శిష్యలతో కలిసి అన్నమయ్య విరచిత నరసింహ స్వామి వారి సంకీర్తనలు నమామ్యహం మానవసింహం, ఫాలనేత్రానల, అంబుజాక్ష నమో, రావమ్మా మహాలక్ష్మీ, విష్ణుడోక్కడే విశ్వాత్మకుడు మొదలగు బహుళ ప్రాచుర్యం పొందిన అన్నమాచార్య కీర్తనలను సుమధురంగా ఆలపించారు. గాత్ర సహకారం అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులు సాందీప్, చైత్ర, సాయి రన్వితా, సహస్ర, అభిరామ్ కీబోర్డ్ రాజేశ్వరరావు (రాజు), తబలా బి. వి. రమణ మూర్తి, డ్రమ్స్ అరుణ్ వాద్య సహకారం అందించారు. ఈ సంకీర్తనలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. కార్యక్రమానంతరం శోభారాజుని ఆలయ ప్రముఖులు సత్కరించారు.