శేరిలింగంపల్లి, అక్టోబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోనీ స్టాలిన్ నగర్ కాలనీలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై స్థానిక నాయకులు, కాలనీవాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కాలనీలో పర్యటించి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ కాలనీలోని సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, స్టాలిన్ నగర్ కాలనీలో తలెత్తిన సమస్యలను స్వయంగా వెళ్లి పర్యటించి పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందన్నారు. కొన్ని సమస్యలు అక్కడ్కడే పరిష్కరించడం జరిగిందన్నారు. PAC ఛైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో స్టాలిన్ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను విడతల వారిగా త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. డ్రైనేజీ, మంజీరా మంచినీటి వసతులను మెరుగుపరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ నాయక్, స్టాలిన్ నగర్ కాలనీ అధ్యక్షుడు వెంకటేష్, స్థానిక నాయకులు హనుమంత్ రావు, మోహిన్, నరేష్, శ్యామల, రఘు, శ్రీను , నర్సప్ప, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.






