శేరిలింగంపల్లి, అక్టోబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవ్ 2025 సందర్బంగా నిర్వహిస్తున్న గుజరాత్ హస్తకళా ఉత్పత్తులు, అద్దాల డ్రెస్ మెటీరియల్స్, బండిని చీరలు, పటోళ్ల చీరలు, కార్పెట్స్, తోలు బెల్టులు , బ్యాగులు, మరెన్నో ఉత్పత్తులు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా శ్రీకాకుళం నుండి హాజరైన నాట్య గురువు శైలజ శిష్య బృందం మూషిక వాహన, వాణి గణపతి, పుష్పాంజలి, శివోహం, కదిలే నర్సింహుడు, జయ జనార్ధన, ఆత్మరామా, వందేహం, భావములోన, ఓం సర్వాణి, గోవిందనామాలు, అదిగో అల్లదిగో, లలిత హారతి, కొలువైతి వరంగ శాయి అంశాలను తేజేశ్వర్ రావు, కీర్తన, డింపుల్ , పూజిత, విమల, త్రయంతీ, ప్రణవి, హమాన్య మలర్, ఢిల్లేశ్వరి, గుణీశ, ధన్విక, అంజనా శ్రీ ప్రదర్శించి మెప్పించారు.






