కాలనీలలో మౌలిక వసతుల క‌ల్ప‌న‌కు కృషి: కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

చందాన‌గ‌ర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీలో ఉన్న‌ కార్పొరేటర్ నివాసంలో బుధవారం కేఎస్ఆర్ ఎన్ క్లేవ్ కు చెందిన లింగా రెడ్డి ఆధ్వర్యంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి స‌న్మానించారు. అనంత‌రం ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో తన గెలుపుకు కృషి చేరిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అసోసియేషన్ సభ్యులు ఈ సంద‌ర్భంగా కాలనీలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన ఆమె.. స‌మ‌స్య‌ల‌ పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాన‌ని తెలిపారు. వారు త‌మ‌కు ఏ చిన్న సమస్య వచ్చినా తన‌ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, రామచంద్ర రావు, రవి, ప్రభాకర్, నగేష్, భూపతి, సుబ్బారావు, ఉపేందర్, నవీన్, రాజేష్ పాల్గొన్నారు.

కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న రెడ్డి కాలనీ అసోసియేష‌న్ స‌భ్యులు
రెడ్డి కాలనీ అసోసియేష‌న్ స‌భ్యుల‌తో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here