శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అభినందించారు. ఈ సందర్భంగా PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని, కాలనీ అసోసియేషన్ భాగస్వామ్యంతో అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ రావు, కార్యవర్గ సభ్యులు మహేశ్వర్ రెడ్డి, కోటి రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, అంజయ్యా, సూర్యనారాయణ, బసవేశ్వరావు, జీవన్, సీతాకుమారి, మంజుల, జగదీశ్వర్ రావు, లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి, శైలేష్ రెడ్డి, శ్రీధరాచారి, వెంకట్రావు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.