చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): అందరూ మనవారే అని, కాలనీ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పోవాలని, దీప్తి శ్రీ నగర్ కాలనీ వాసులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీలో ఉన్న కార్పొరేటర్ నివాసంలో గురువారం దీప్తి శ్రీ నగర్ కాలనీ కి చెందిన కరుణ్ గౌడ్, జే వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో కాలనీ వాసులు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆమెకు పుష్ప గుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. కాలనీ అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ విప్ గాంధీ సహకారంతో డివిజన్ ను ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.మోహన్, మల్లేశ్, శ్రీనివాసులు, సిద్దు, చంద్రమౌళి, కె.భాస్కర్ రావు, శేఖర్ పాల్గొన్నారు.