శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): రైతుల సమస్యలపై పోరాటం మేరకు భారాస పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన నాయకులు ప్రజాభవన్ ముట్టడికి తరలి వెళ్తుండగా వారిని మియాపూర్ పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకుని మియాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో వాల హరీష్ రావు, బాబు మోహన్ మల్లేష్, జనార్దన్ గౌడ్, కిరణ్ యాదవ్, ఓబరా శ్రీనివాసరావు, రోజా తదితరులు ఉన్నారు.