శేరిలింగంపల్లి, అక్టోబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): దసరా పండుగను పురస్కరించుకొని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నేతాజీ నగర్ కాలనీలో శ్రీ భగవతి రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ శివ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా శమీ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ శమీ పూజా కార్యక్రమానికి హాజరైన కాలనీ వాసులు అందరికీ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కాలనీవాసులు ఒకరికొకరు జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకొని ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఆప్యాయత అనురాగాలను, బంధాలను బంధుత్వాలను మనసారా ఆస్వాదిస్తూ పండుగ వాతావరణంలో మునిగిపోయారు.

శమీ వృక్షం విజయానికి సూచిక అని అన్నారు. జమ్మి ఆకులతో పెద్దలను గౌరవించుకోవడం చిన్నలను ప్రేమగా పలకరించుకోవడం ఆలింగనం చేసుకోవడం విజయదశమి ప్రత్యేకత అని అన్నారు. బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, ఉపాధ్యాయులు రాయుడు, కే నరసింహ యాదవ్, తెలుగు భాష ముదిరాజ్, అన్నదొర, రాములు నాయక్, బాలరాజ్ నాయక్, సురేష్, కుమార్ నాయక్, బేరి శ్రీనివాస్ యాదవ్, బేరి చంద్రశేఖర్ యాదవ్, సత్తెమ్మ, చిట్టెమ్మలాల్ రెడ్డి, అనురాధ, సంధ్య, మహిళలు, నాయకులు పాల్గొన్నారు.





