చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి ఉద్యమకారుల ఐక్యవేదిక (టీఆర్ఎస్ అనుబంధం) కార్యాలయాన్ని చందానగర్‌లో వేధిక వ్యవస్థాపకులు మిద్దెల మల్లారెడ్డి, వారి మాతృమూర్తి మిద్దెల లలితమ్మతో కలసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ విజయదశమి పర్వదినం నేపథ్యంలో కార్యాలయాన్నిసూత్రప్రాయంగా ప్రారంభించామని, త్వరలోనే ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డిలతో పాటు స్థానిక కార్పొరేటర్‌ల చేతుల మీదుగ లాంచనంగా ప్రారంభించుకుంటామని అన్నారు. ఉద్యమంలో భాగస్వాములైన ప్రతీ టీఆర్ఎస్ కార్యకర్తకు ఐక్యవేదికలో సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థులు వేదిక కార్యాలయాన్ని వాడుకోవచ్చని తెలిపారు.






