మదీన డ్రై ప్రూట్స్ దుకాణాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ మైనార్టీ నేత అన్వర్ షరీఫ్

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తీశ్రీనగర్ శాంతినగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మదీన డ్రై ఫ్రూట్స్ దుకాణాన్ని టీఆర్ఎస్ పార్టీ మైనారిటీ రాష్ట్ర నాయకుడు‌ అన్వర్ షరీప్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్వర్ షరీఫ్ మాట్లాడుతూ దీప్తీశ్రీనగర్ పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా డ్రై ఫ్రూట్స్ దుకాణాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు‌ చేసే పోషక విలువలతో కూడిన డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు ఎండి‌ యాదుల్లాతో పాటు స్థానిక నాయకులు మల్లేష్, నరేందర్, రాజు, రహ్మతుల్లా, ఇబ్రహీం,‌ ముఖీం, గౌస్, అల్లావుద్దీన్ తదితరులు ఉన్నారు.

మియాపూర్ శాంతినగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రై ఫ్రూట్స్ షాప్ ప్రారంభోత్సవం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here