శేరిలింగంపల్లి, జనవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ విలేజ్ లో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ మరమ్మత్తు పనులను స్థానిక నాయకులు, జలమండలి అధికారులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ విలేజ్ లో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ మరమ్మత్తు పనులను స్థానిక నాయకులు, జలమండలి అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని, డ్రైనేజీ మరమ్మత్తు పనులను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు తెలియజేయడం జరిగిందని, మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తిలో ఎలాంటి సమస్యలు వున్న తమ దృష్టికి తీసుకువస్తే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు మేనేజర్ సునీత, వర్క్ ఇన్స్పెక్టర్ లింగయ్య, స్థానిక నాయకులు మహేందర్ ముదిరాజ్, వజీర్ తదితరులు పాల్గొన్నారు.
