శేరిలింగంపల్లి, జనవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): నల్లగండ్ల చెరువు నుండి BHEL చౌరస్తా గ్యాస్ గోడౌన్ నాలా వరకు రూ. 28 కోట్ల 45 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే నాలా విస్తరణ నిర్మాణం పనులను, RCC బాక్స్ నిర్మాణం పనులను జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, SNDP విభాగం CE కోటేశ్వరరావు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీమాట్లాడుతూ SNDP ఫేస్ 2 లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.79 కోట్ల 58 లక్షల అంచనా వ్యయంతో నాలాల విస్తరణ పనులు చేపట్టడంతో ఎన్నో ఏండ్ల వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నాలాల విస్తరణ పనులతో లోతట్టు, ముంపు ప్రాంతాలకు ఉపశమనం లభించింది అని, ప్రజా అవసరాల దృష్ట్యా ప్రథమ ప్రాధాన్యతగా విస్తరణ పనులు చేపట్టాలని, నాలాల విస్తరణ పనులలో వేగం పెంచాలని, యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించాలని అధికారులకు తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో SNDP అధికారులు CE కోటేశ్వరరావు, SE భాస్కర్ రెడ్డి, DE రాజు, DE వశిధర్, AE వెంకటేష్, AE మహేందర్ రెడ్డి, AE యుగంధర్, GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు SE శంకర్ నాయక్, EE GK దుర్గప్రసాద్ , EE KVS రాజు, DE ఆనంద్, DE దుర్గాప్రసాద్ ,DE విశాలాక్షి, DE శ్రీదేవి, AE ప్రశాంత్,AE ప్రతాప్, AE జగదీష్ ,AE రషీద్, AE సంతోష్ రెడ్డి,AE సంతోష్, DE స్ట్రీట్ లైట్స్ కవిత, ఇతర అధికారులు పాల్గొన్నారు.