నేతాజీ నగర్ సమస్యలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినతి

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఒకరోజు ఒక వార్డు కార్యక్రమంలో భాగంగా నల్లగండ్ల 256వ వార్డులోని గుల్మోహర్ కాలనీలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నేతాజీ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించడంతోపాటు స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఇంజనీరింగ్, ఎస్‌డబ్ల్యూఎం, టౌన్ ప్లానింగ్, యూబీడీ, ఎంటమాలజీ తదితర విభాగాల అధికారులు, స్థానిక ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ పార్కులో నీటి సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన పిట్‌ను అధికారులు పరిశీలించారు. అనంతరం నేతాజీ నగర్ కాలనీలోని అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్య పనులు, ఇతర మౌలిక వసతుల సమస్యలపై బేరి రామచందర్ యాదవ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కాలనీలో నెలకొన్న సమస్యలను కమిషనర్, డిప్యూటీ కమిషనర్, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి వివరించారు.

సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి, త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని బేరి రామచందర్ యాదవ్ తెలిపారు. ప్రతి కాలనీకి అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తుండటం అభినందనీయమని పేర్కొంటూ అధికారులకు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కే. నరసింహ యాదవ్, అన్నదొర, దశరథ్ నాయక్, గణేష్ నాయక్, జోషి రాఘవేంద్ర శర్మ, మణికంఠ, ప్రసాద్ తదితరులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here