అయ్య‌ప్ప స్టూడెంట్ యూత్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో పేద‌ల‌కు ఆహారం పంపిణీ

చందాన‌గ‌ర్‌‌‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని గంగారం ప‌రిస‌ర ప్రాంతాల్లో అయ్య‌ప్ప స్టూడెంట్ యూత్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం పేద‌ల‌కు ఆహారం పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి.రోహిత్ ముదిరాజ్ మాట్లాడుతూ పేద‌ల‌కు ఫీడ్ ది నీడ్ పేరిట ఆహారాన్ని పంపిణీ చేస్తున్నామ‌ని అన్నారు. ముందు ముందు ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను మ‌రిన్ని నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. పేద‌ల‌కు ఆహారం అందిస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు హ‌రీష్‌, క‌లాం, వెంక‌టేష్, న‌వీన్ పాల్గొన్నారు.

పేద‌ల‌కు ఆహారం పంపిణీ చేస్తున్న అయ్య‌ప్ప స్టూడెంట్ యూత్ ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి.రోహిత్ ముదిరాజ్, స‌భ్యులు
పేద‌ల‌కు ఆహారం పంపిణీ చేస్తున్న అయ్య‌ప్ప స్టూడెంట్ యూత్ ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి.రోహిత్ ముదిరాజ్, స‌భ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here