మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులు పొందిన రాగం దంప‌తులు

శేరిలింగంప‌ల్లి‌‌‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ ప‌ర్స‌న్ రాగం సుజాత‌, శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దంపతులు ద‌ర్శించుకుని ఆయ‌న ఆశీస్సులు పొందారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు కొయ్యాడ లక్ష్మణ్, సత్యనారాయణ రెడ్డి, గోపాల్ యాదవ్, పట్లోళ్ల‌ నర్సింహారెడ్డి, సాయి పాల్గొన్నారు.

మాధవానంద సరస్వతి స్వామిని ద‌ర్శించుకున్న రాగం సుజాత‌, నాగేంద‌ర్ యాద‌వ్ దంప‌తులు

గోశాల సంద‌ర్శ‌న‌…
అమీన్‌పూర్ మున్సిప‌ల్ ప‌రిధిలోని బీరంగూడ‌లో ఉన్న గోశాల‌ను శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, యువనేత రాగం అనిరుద్ యాదవ్ లు సోమ‌వారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వారు గోమాతలకు గ్రాసం, పండ్లు అంద‌జేశారు. గోవుల‌కు పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, బస్వరాజు, ఎ.రాజు, గోపాల్ యాదవ్, పట్లోళ్ల‌ నర్సింహారెడ్డి, ఘనపురం రవీందర్ యాదవ్, సాయి, చిన్నా పాల్గొన్నారు.

బీరంగూడ గోశాల‌లో గోవుల‌కు గ్రాసం, పండ్లు తినిపిస్తున్న కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌, యువ‌నేత రాగం అనిరుద్ యాద‌వ్

మ్యాన్‌హోల్ పనుల ప‌రిశీల‌న‌…
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారా నగర్ మెయిన్ రోడ్డుపై కొన‌సాగుతున్న మ్యాన్‌హోల్ పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సోమ‌వారం ప‌రిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దుర్గం వీరేశం గౌడ్, బస్వరాజు, గోపాల్ యాదవ్, ఘనపురం రవీందర్ యాదవ్, పట్లోళ్ల‌ నర్సింహారెడ్డి, సాయి పాల్గొన్నారు.

తారాన‌గ‌ర్ మెయిన్ రోడ్డుపై మ్యాన్ హోల్ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here