శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ఏఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని ఆ సంస్థ చైర్మన్ రేవంత్ రాజ్ ముదిరాజ్ అన్నారు. శనివారం జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు, లింగంపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న 200 మంది పేదలకు ఆయన దుప్పట్లను పంపిణీ చేశారు. పేదలకు, కార్మికులకు ఎల్లప్పుడూ ఏఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని రేవంత్ రాజ్ ముదిరాజ్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో కూడా ప్రతి రోజు వందల మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని తెలిపారు. తమ ఫౌండేషన్ పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దుబే కాలనీ అధ్యక్షుడు అనిల్ కుమార్, రాయల ప్రవీణ్ కుమార్, ఫణికుమార్, నో ఫుడ్ వేస్ట్ అధ్యక్షుడు వెంకట మురళి, వసంతలక్ష్మి, అజ్మల్ పాల్గొన్నారు.