మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ల తనకు అవకాశం కల్పించాలని కోరుతూ స్థానిక టిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కలిదిండి రోజా ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీకి సోమవారం బయోడాటా అందజేశారు. స్థానిక కార్పొరేటర్ మృతితో ఖాళీగానే స్థానంలో ప్రజల్లో ఉన్న నాయకులకు అవకాశం కల్పించాలని కోరారు. దశాబ్దంన్నర కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో ప్రజలతో సంబంధాలు ఉన్న నేపథ్యంలో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తనకు అవకాశం ఇస్తే భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గాంధీని కలిసిన వారిలో గోపరాజు శ్రీనివాస్, డివిజన్ కు చెందిన మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.