శేరిలింగంప‌ల్లిలోని పలు డివిజన్లలో బిజెపి నాయ‌కుల బ‌స్తీబాట‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: భార‌తీయ జ‌న‌తాపార్టీ రాష్ట క‌మిటీ మేర‌కు శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ప‌లు డివిజ‌న్ల నాయ‌కులు బుధ‌వారం ప‌లు ప్రాంతాల్లో బ‌స్తీబాట కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా డివిజ‌న్ల ప‌రిధిలోని బ‌స్తీలు, కాల‌నీల్లో ప‌ర్య‌టించి స్థానికులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.

హ‌ఫీజ్‌పేట్ డివిజ‌న్‌లో…
హఫీజ్ పెట్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు శ్రీధర్ రావు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన బ‌స్తీబాట కార్య‌క్ర‌మంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు బస్తీల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అనేక ప్రాంతాల్లో ప్ర‌జ‌లు దోమల బెడద, వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి స‌ర‌ఫ‌రా త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు పడుతున్నారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లు, అస్త‌వ్య‌స్తంగా మారిన పారిశుధ్యంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నా ప్ర‌జాప్ర‌తినిధులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలిపారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, ప‌రిష్కార‌మ‌య్యే వ‌ర‌కూ పోరాడ‌తామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో సీనియర్ నాయకులు కోటేశ్వరరావు, రవి గౌడ్, జితేందర్, శ్రీనివాస్, జగన్, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హ‌ఫీజ్‌పేట్ డివిజ‌న్ బ‌స్తీబాట కార్య‌క్ర‌మంలో బిజెపి రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు జ్ఞానేంద్ర‌ప్ర‌సాద్‌ త‌దిత‌రులు

శేరిలింగ‌ప‌ల్లి డివిజ‌న్ లో…
శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ బిజెపి అధ్య‌క్షులు రాజు శెట్టి కురుమ అధ్వర్యంలో పార్టీ నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు డివిజ‌న్ ప‌రిధిలోని నెహ్రూ నగర్, గోపినగర్ లోని లోతట్టు ప్రాంతల‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రానున్న వర్షం కాల వరదల దృష్యా ప్రజలను అప్రమత్తం చేసి తగిన జాగ్రతలు పాటించాలని సూచించారు. ఈ సంద‌ర్భంగా రాజు శెట్టి మాట్లాడుతూ దురదృష్టవశాత్తు ఇల్లు నీట మునిగిన ప్ర‌జ‌ల‌కు తాత్కాలిక పునరావాసం కల్పిస్తామ‌ని తెలిపారు. అలాగే గత సంవత్సరం వరదల వల్ల జరిగిన నష్టాలు మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేవైఎం నాయకులు నీరటి చంద్ర మోహన్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్య కుర్మ, ఉపాదక్ష్యులు బాలరాజు, కోశాధికారి పి. కౌసల్య, భీమాని విజయ లక్ష్మి, భీమాని సత్యనారాయణ ముదిరాజ్, సిద్దు కురుమ, నీలకంఠ రెడ్డి, స్వాతి, పౌల్, సాయి యాదవ్ మరియు స్థానికులు పాల్గొన్నారు.

శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ బ‌స్తీబాట‌లో స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకుంటున్న రాజుశెట్టి త‌దిత‌రులు

మియాపూర్ డివిజ‌న్‌లో…
మియాపూర్ డివిజ‌న్ బిజెపి అధ్య‌క్షులు మాణిక్‌రావు ఆధ్వర్యంలో నిర్వ‌హించిన బ‌స్తీబాట కార్య‌క్ర‌మంలో రంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు డిఎస్ఆర్‌కె ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ స‌భ్యులు మనోహర్ ల‌తో పాటు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు డివిజ‌న్‌లోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా స్థానికంగా నెల‌కొన్న ప‌లు స‌మ‌స్య‌ల‌ను గుర్తించారు. న్యూ కాలనీ వీకర్ సెక్షన్ లో త్రాగు నీరు మరియు డ్రైనేజ్ లోని మురికి నీళ్లు కలిసి అక్కడ నివసిస్తున్న ప్రజలకి తీవ్ర అనారోగ్యానికి గుర‌వుతున్నార‌ని నాయ‌కులు తెలిపారు. అరబిందో కాలనీ, జెపి నగర్ లో మురికి కాలువ‌లు చెత్త‌తో నిండి మురుగునీరు రోడ్ల‌పై పారుతుంద‌ని తెలిపారు. మక్త మహబూబ్ పేట్ గ్రామంలో రెండు వీధుల్లో సుమారు 50 కుటుంబాలకి మంచినీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు ప‌డుతున్నార‌ని, హెచ్ఎంటి కాల‌నీలో బ‌స్ షెల్ట‌ర్ ఏర్పాటు అవ‌స‌రం ఉంద‌ని, స్థ‌లాన్ని గుర్తించిన‌ట్లు తెలిపారు. పోగుల ఆగయ్య నగర్ లో ప్ర‌భుత్వ స్థ‌లంలో ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేప‌డుతున్న‌ర‌న్నారు. ప్ర‌జయిషెల్టర్స్ నుండి మక్త విలేజ్ మంజూరైన‌ 100 ఫీట్ల రోడ్డు వెంట‌నే పూర్తి చేయాల‌ని డిమాండ్ చేశారు. స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్కార‌మ‌య్యేవ‌రకూ పోరాడ‌తామ‌ని బిజెపి నాయ‌కులు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు మహేష్, ఆకుల లక్ష్మణ్, రత్నం, రామకృష్ణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శీను, గణేష్ ముదిరాజ్, వినోద్ యాదవ్, ప్రసాద్, అశోక్ ముదిరాజ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మియాపూర్ డివిజ‌న్ బ‌స్తీబాట‌లో స‌మ‌స్య‌లు ప‌రిశీలిస్తున్న బిజెపి నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here