మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌లో వెండి వస్తువులపై తగ్గింపు ధరలు

  • చందానగర్‌ షోరూంలో వెండి ఆభరణాల ప్రదర్శన ప్రారంభం

చందాన‌గ‌ర్‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్‌లోని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షోరూంలో శుక్రవారం వెండి ఆభరణాల ప్రదర్శన ప్రారంభమైంది. ఈ ప్రదర్శనకు ప్రముఖ టీవీ నటి అమృత ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం షోరూంలో ఉన్న పలు ఆభరణాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా షోరూం ప్రతినిధులు మాట్లాడుతూ తమ షోరూంలో శుక్రవారం ప్రారంభమైన వెండి ఆభరణాల ప్రదర్శన ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి రూ.5వేల విలువైన వెండి ఆభరణాల కొనుగోలుపై రూ.500 తగ్గింపును అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధఃగా వెండి వస్తువుల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నామన్నారు. కేవలం చందానగర్‌ షోరూంలో మాత్రమే ఈ ప్రదర్శన, ఆఫర్లు ఉంటాయన్నారు.

వెండి ఆభ‌ర‌ణాల ప్ర‌ద‌ర్శ‌నను ప్రారంభించిన అనంత‌రం ఆభ‌ర‌ణాల‌ను చూపుతున్న ప్ర‌ముఖ టీవీ న‌టి అమృత

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here