100 ఫీట్ రోడ్డులో డ్రైనేజీ స‌మ‌స్య‌ను ప‌రిశీలించిన కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

మాదాపూర్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని ప్ర‌తి కాల‌నీ, బ‌స్తీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రిస్తామ‌ని కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ అన్నారు. డివిజ‌న్ ప‌రిధిలోని అయ్య‌ప్ప సొసైటీలో ఉన్న 100 ఫీట్ రోడ్డు వైఎస్సార్ విగ్ర‌హం వ‌ద్ద ఏర్ప‌డిన డ్రైనేజీ స‌మ‌స్య‌ను శుక్ర‌వారం ఆయ‌న ప‌రిశీలించారు. 20 ఫీట్ల లోతులో డ్రైనేజీ పైప్‌లైన్ ఉంద‌ని, అందువ‌ల్ల స‌మ‌స్యను ప‌రిష్క‌రించేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని, 3 రోజుల్లోగా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపుతామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయకులు భిక్షపతి ముదిరాజ్, మధుసూదన్ రెడ్డి, కృష్ణ గౌడ్, సతీష్ యాదవ్, శ్రీనివాస్ గుప్తా, సంజు యాదవ్, లోకేష్, వినోద్ గౌడ, షకీల్, న‌యీమ్ పాల్గొన్నారు.

రోడ్డుపై ప్ర‌వ‌హిస్తున్న డ్రైనేజీని ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here