నమస్తే శేరిలింగంపల్లి: ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జెరిపాటి జైపాల్, రఘునందన్ రెడ్డి అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో ప్రజల కోసం వేసవి కాలం దృష్ట్యా చలివేంద్రాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డి, ఎం. శ్రీనివాస్, రాజన్, ఇలియాస్, అల్లావుదిన్ పటేల్, సురేష్, కిషన్, పాండు, శివ, ప్రేమ్, శివాజీ, స్వామి, శ్రుగతి, రవి వర్మ గారు,సుధాకర్, నగేష్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా సెయింట్ సెల్ చైర్మన్ దేవావత్ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.