నమస్తే శేరిలింగంపల్లి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మురికి నీరు సరఫరా కాకుండా ఎప్పటికప్పుడు జలమండలి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్ఎండబ్ల్యుఎస్ ఎండీ దానకిశోర్ చెప్పారు. వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మురుగునీరు కలిసి రావడం, తదితర సమస్యలు ఉన్న నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలలో భాగంగా ముజాఫర్ అహ్మద్ నగర్ లో ఎండీ దాన కిశోర్ పర్యటించారు. మూజాఫర్ అహ్మద్ నగర్ కార్యదర్శి తుడుం అనిల్, బస్తీ వాసులు దానకిషోర్ కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. బస్తీలో ప్రధానంగా నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించినందుకు జలమండలి అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ సీజీఎం అనిల్ కుమార్, జీఎం రాజశేఖర్, డీజీఎం నాగప్రియ, మేనేజర్ సాయి చరిత, వర్క్ ఇన్ స్పెక్టర్ రమేష్, ధనుంజయ్ బస్తీ వాసులు లసానీ రాజు, కొడిపాక రాజు, పల్లె మురళీ, వెంకటేష్, రవికాంత్, పి.రాజు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.