నమస్తే శేరిలింగంపల్లి: దళిత బంధు పథకం ద్వారా దళితులు ఆర్థికంగా వృద్ధి చెందడంతో పాటు సామాజిక అసమానత రూపు మాపవుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని కైలాష్ నగర్ కు చెందిన శ్రీకాంత్ కు, మాదాపూర్ డివిజన్ పరిధిలోని భిక్షపతి నగర్ కి చెందిన నాగరాజుకు, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డికి చెందిన పరమేష్ కు మంజూరైన కార్ల ను మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాప్ కార్యాలయంలో కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశల వారీగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుందన్నారు. సీఎం కేసీఆర్ దళిత బాంధవుడని, దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. దళితులలో ద్విగుణీకృత మార్పు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నం రాజు, సత్యనారాయణ, జంగయ్య యాదవ్, కాశీనాథ్ యాదవ్, రాజు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.