నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంవీ జ్ఞానేంద్ర ప్రసాద్ మరణం పార్టీకి తీరని లోటని బిజెపి రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. కీ శే. జ్ఞానేంద్ర ప్రసాద్ దశదిన కర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి బిజెపి నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
బిజెపి జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మధ్య ప్రదేశ్ రాష్ట్ర బిజెపి ఇంచార్జీ పీ. మురళీధర్ రావు, శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జీ గజ్జల యోగానంద్, బిజెపి నాయకులు మువ్వా సత్యనారాయణ, ప్రభాకర్ యాదవ్ , వై. శ్రీధర్, పోరెడ్డి బుచ్చిరెడ్డి, చింతకింది గోవర్ధన్ గౌడ్, నాగేశ్వర్ గౌడ్, వసంత్ కుమార్ యాదవ్, మనోహర్, వర ప్రసాద్, బిజెవైఎం రాష్ట్ర నాయకులు అరుణ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు, మాణిక్ రావు, ఆంజనేయులు, రాజు శెట్టి, నవీన్ గౌడ్, నర్సింగ్ రావు, బిజెవైఎం జిల్లా నాయకులు జితేందర్, బిజెపి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.