బోనాల మహోత్సవాల్లో ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండగ ప్రతీక అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. బోనాల పర్వదిన సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని హెచ్ సీ యూ డిపో వద్ద గల శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో, చందానగర్ డివిజన్ పరిధిలోని తారానగర్ వీకర్ సెక్షన్ కాలనీ శ్రీ శ్రీ శ్రీ కట్ట మైసమ్మ‌ దేవాలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

హెచ్ సీ యూ బస్ డిపో వద్ద గల ఎల్లమ్మ‌తల్లి ఆలయంలో ప్రభుత్వ విప్ గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదిన సందర్భంగా బోనాల పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, టీఆర్ఎస్ నాయకులు పద్మారావు, పొడుగు రాంబాబు, సురేందర్, వేణు గోపాల్ రెడ్డి, నటరాజు, రమణయ్య, పవన్, ఉరిటి వెంకట్రావు, సత్తయ్య, వసుంధర దేవి, బాలకృష్ణ,‌ కాశీ, పావని తదితరులు పాల్గొన్నారు.

వీకర్ సెక్షన్ కాలనీలోని శ్రీ కట్ట మైసమ్మ దేవాలయంలో పూజలు‌ నిర్వహిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here