శేరిలింగంపల్లి, జనవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కూకట్ పల్లి దీనబంధు కాలనీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన నేతాజీ చిత్రపటానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జరిపిన సాయుధ పోరాటం ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి చెయ్యాలని తలచిన వారిలో ఆయన ప్రముఖులని తెలిపారు. అంతేకాకుండా నేతాజీ జన్మదినాన్ని పరక్రమ దివాస్ గా జరుపుకుంటామని తెలుపుతూ, ఆయన జాతీయవాదం, దేశభక్తికి ప్రతీక అని అన్నారు. ఆయన జీవితం అని గురించి, ఆయన చేసిన పనుల గురించి లేదా ఆయన మరణం గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వంశీ రెడ్డి, బాలు యాదవ్, రమేష్, బిజవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేష్, సీనియర్ నాయకులు పర్వతాలు యాదవ్, నర్సింగ్ యాదవ్, గోపాల్ రావు, భూపాల్ రెడ్డి, రాజి రెడ్డి, చారి, నర్సింగ్ రావు,నరేష్,మురళీ,శ్రీకాంత్ యాదవ్, విజయ్, కళ్యాణ్, లలితా రెడ్డి, మమత, కవిత, రేణుక, బంటీ, పవన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
