నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీనగర్ కాలనీ లో ఏర్పడిన వర్షపు నీటి సమస్యలను గురువారం అర్థరాత్రి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. వర్షాల దృష్ట్యా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. లోతట్టు, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించాలన్నారు. వర్షాలు పడుతున్న సమయంలో ఇంటి నుండి బయటకి రాకుండా ఉండాలని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిత్యం అందుబాటులో ఉంటానని ఏ చిన్న సమస్య ఉన్నా తన దృష్టికి గాని , మా కార్యాలయం దృష్టికి గాని తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఆయన వెంట ఏఈ ధీరజ్ , చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి , నాయకులు గురు చరణ్ దుబే, ఓ .వెంకటేష్ , సందీప్ , అవినాష్ తదితరులు పాల్గొన్నారు.