నమస్తే శేరిలింగంపల్లి: వినాయక నవరాత్రోత్సవాల్లో మట్టి వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సూచించారు. వినాయక పండగ సందర్భంగా హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ ఆధ్వర్యంలో తయారు చేయించిన మట్టి వినాయకుల ప్రతిమలను శుక్రవారం ప్రభుత్వ విప్ గాంధీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ భవిష్యత్ తరాల ను దృష్టిలో పెట్టుకొని సమాజ హితం కోసం హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను పూజించాలని సూచించారు. హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండా విజయ్ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా ఈ సంవత్సరం 3 వేల మట్టి వినాయకులని పంపీణీ చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.