శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లోని ధర్మపురి క్షేత్రంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న కార్యక్రమాల్లో మొదటి రోజు జ్యోతి నాయర్ శిష్య బృందం ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా క్షేత్రం వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి కళకారులను సన్మానించి అభినందనలు తెలిపారు.