శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా వై ఎస్ కళ్యాణి కూచిపూడి నృత్య ప్రదర్శన లో శివాష్టకం, బాలగోపాలా తరంగం అంశాలను ప్రదర్శించారు. భువనేశ్వరి బరిక్ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ఆధ్యంతం అలరించింది. ఝేమ్ ఝేమ్ తనన, నమశ్శివాయ, అన్నమాచార్య కీర్తన, వినాయక కౌతం, మూషిక వాహన, మండూక శబ్దం, రామదాసు కీర్తన అంశాలను అవని, దీపాలి, అక్షర, రసజ్ఞ, నిత్యశ్రీ, దీక్షిక, శ్లోక, సహన, ఇషాన్వి, శ్రీహిత, తాన్విక, అక్షయ ప్రదర్శించారు. ప్రముఖ నాట్య గురువు డాక్టర్ వనజ ఉదయ్, డాక్టర్ కిరణ్మయి బోనాల విచ్చేసి కళాకారులను అభినందించారు.