సంత్ సేవాలాల్ మార్గంలో న‌డ‌వాలి: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చదువుకున్నప్పుడే సమాజంలో గౌరవం ఉంటుంద‌ని, చదువుల బాట పట్టాల‌ని, సంత్ సేవాలాల్ మార్గంలో నడవాల‌ని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ బస్తీలో నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకల్లో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ మాట్లాడుతూ.. పేదల రాజ్యం రావాలని మీరు నినదించారు. మీ ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది, మీ కోసం, మీ అభ్యున్నతి కోసం కష్టపడే ప్రభుత్వం వచ్చింది, మీ అభివృద్ధి కోసం మా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కరెంటు, తాగునీరు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్వారీ శశిధర్, ప్రభాకర్, సంగమేష్, రెహ్మాన్, రవి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here