శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి యలమంచి ఉదయ్ కిరణ్, తెలంగాణ పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ను శాలువా తో సత్కరించి అనంతరం యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్టు క్యాలెండర్ ను ఆవిష్కరణ గావించారు. కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ, ప్రజోపకరమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ టీం సభ్యులను ఆయన ఈ సందర్భంగా వారి సామాజిక సేవా స్పృహ ను అభినందించారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్న యువత వారి విశిష్ట సేవలను తప్పక గుర్తింపు ఇస్తుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శరత్, వినోద్, కృష్ణ, వంశీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.