శేరిలింగంపల్లి, నవంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన బాధితులకు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ సీఎంఆర్ఎఫ్ ద్వారా అందిన సహాయాన్ని అందజేశారు. కూకట్‌పల్లి డివిజన్ ప్రగతినగర్‌కు చెందిన బూటన్ దేవికి రూ.60వేలు, చందానగర్ డివిజన్ పీఏ నగర్‌కు చెందిన ముని శేఖర్‌కు రూ.60వేలు, ఆనంద్ కుమార్‌కు రూ.60వేలు, హఫీజ్‌పేట డివిజన్ కు చెందిన గంగారం యాదమ్మకు రూ.52,500, వివేకానందనగర్ డివిజన్ కు చెందిన శంకర్‌కు రూ.57,500 మంజూరు కాగా ఈ మేరకు ఆ చెక్కులను సదరు బాధితులకు జగదీశ్వర్ గౌడ్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఆపదలో ఉన్న పేదలను ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ లేబర్ సెల్ చైర్మన్ నల్లా సంజీవ రెడ్డి, నియోజకవర్గ నాయకురాలు కల్పన ఏకాంత్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు భాష్పాక యాదగిరి, రవి కుమార్ నాయీ, అయాజ్ ఖాన్, విష్ణు, పరుశురాం, సురేష్, ప్రదీప్, రవి కుమార్ గౌడ్, రాంచందర్ గౌడ్, వెంకట్ రెడ్డి, ఇస్మాయిల్, నితిన్ గౌడ్, మహిళలు తదితరలు పాల్గొన్నారు.