మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): గణత్రంత్ర దినోత్సవం సందర్భంగా మాదాపూర్ శిల్పారామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సత్యం డాన్స్ అకాడమీ కామేశ్వరి మేళ్లచెరువు శిష్య బృందం కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి అలరించింది. వందేమాతరం, ఆడేయ్ పాడేయ్ పిల్లలం, ఎటువంటి వాడే, ఎవడే వాడు, ముద్దుగారే యశోద, వెడలె రామయ్య, లక్ష్మి ప్రవేశం, అష్ట లక్ష్మి, ధనశ్రీ తిల్లాన అంశాలను అఖిల, ప్రియాంక, అరుణ, శ్రేయ తదితరులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.