చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు గుడ్ల ధనలక్ష్మికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ధనలక్ష్మి తన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిల ఆద్వర్యంలో గురువారం ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుడ్ల ధనలక్ష్మికి బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్ ను కలిసిన వారిలో సుప్రజా ప్రవీణ్, భవాని చౌదరి ఉన్నారు.