శేరిలింగంపల్లి, జనవరి 8 (నమస్తే శేరిలింగంపల్లి): అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య(AIFDS) ఆధ్వర్యంలో పల్లె మురళి అరుణ్, శ్రీకాంత్, నాయకత్వంలో తాండ్ర కుమార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించారు. ఈ ఆటల పోటీలలో 16 జట్లు పాల్గొన్నారు. 16 జట్టులను ఢీకొని ఐలాపూర్ వారియర్స్, పవన్ 11 జట్లు ఫైనల్ చేరుకున్నారు. ఫైనల్లో పవన్ 11 జట్టు విజయసాదించింది. విజయం సాధించిన విజేతలకు ఏం సిపిఐ (యు) నాయకుడు తాండ్ర రమేష్ ఏజిపి చేతుల మీదుగా బహుమతులు, 20,000 నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో యం సి పి ఐ యు నాయకులు దశరధ్ నాయక్, సిపిఐఎం నాయకులు కృష్ణ అమర జీవి తాండ్ర కుమార్ సతీమణి తాండ్ర కళావతి, మహిళా సంఘం నాయకురాలు అంగడి పుష్ప, అనితా,శివాని,సుల్తానా బేగం తాండ్ర వెను అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు.