శేరిలింగంపల్లి, జనవరి 8 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీ లో ఉన్న M-Gen (మల్టీ జనరేషన్) పార్క్ సుందరికరణ, అభివృద్ధి నిర్మాణం పనులను, మక్తా మహబూబ్ పెట్ చెరువు అభివృద్ధి కొరకు చేపట్టే పనులను మేయర్ గద్వాల విజయలక్ష్మి, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డీసిలు మోహన్ రెడ్డి, ముకుందా రెడ్డి, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీమాట్లాడుతూM – Gen మల్టీ జనరేషన్ పార్క్ ను అన్ని రంగాలలో సుందరీకరించి, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో ,అన్ని రకాల మౌళిక వసతులతో సుందరీకరించి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకువచ్చామని, త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE KVS రాజు, DE దుర్గ ప్రసాద్ , AE సంతోష్ కుమార్ ఇరిగేషన్ DE నళిని, AE పావని, కాలనీ వాసులు, నాయకులు ,కార్యకర్తలు, మహిళలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.