ఉప్పల్ (నమస్తే శేరిలింగంపల్లి): ఉప్పల్‌లోని మినీ శిల్పారామంలో ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు క్రాఫ్ట్స్ మేళాను నిర్వహిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా భగల్ పూరి, టుస్సార్, జాంధానీ, బెనారస్, పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట, కోట, బెంగాల్ హ్యాండ్ పెయింటెడ్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, చేనేత దుప్పట్లు, లెదర్ బ్యాగ్స్, చెప్పులు, జ్యూట్ ఉత్పత్తులు, టెర్రకోట, బ్లూ పాటరీ, వుడ్ కార్వింగ్, కేన్ ఫర్నిచర్ కి సంబందించిన ఉత్పత్తులతో మొత్తం 0 స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే నిత్యం సాయంత్రం 5.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సందర్శకులు మేళాలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.