శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.6,86,000 ల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలకి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ఆల్విన్ కాలనీ డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, తెరాస నాయకులు శ్రీకాంత్ రెడ్డి, బాబు, ప్రమీల పాల్గొన్నారు.