నమస్తే శేరిలింగంపల్లి: రక్తం నగేష్ గౌడ్ గొప్ప భావాలున్న కమ్యూనిస్టు నాయకుడని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన మహానుబావుడని సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పేర్కొన్నారు. రక్తం నగేష్ గౌడ్ నాలుగో వర్ధంతి సందర్భంగా కొత్తగూడెంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి సీపీఐ జిల్లా నాయకులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం చేసి వేలాది మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు రక్తం నగేష్ గౌడ్ అని అన్నారు. చిన్నవయస్సులోనే కమ్యూనిస్టు పార్టీలో చేరి మండల స్థాయి నుండి రాష్ట్ర సమితి సభ్యుల స్థాయి వరకు ఎదిగిన నాయకుడు రక్తం నగేష్ గౌడ్ అని ఆయన కొనియాడారు. నిరంతరం ప్రజా ఉద్యమాలకు కష్టజీవులకు అండగా నిలవాలనే ఆలోచన కలిగిన గొప్ప కమ్యూనిస్టు లక్షణాలు ఉన్న నాయకుడు అన్నారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, లింగంపల్లి ఏరియా కార్యదర్శి టి రామకృష్ణ, జిల్లా సమితి సభ్యులు కె నరసింహా రెడ్డి, కే చందు యాదవ్, లింగం గౌడ్, వినయ్ గౌడ్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.