సెప్టెంబర్ 4వ తేదీ నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సీపీఐ మహాసభలు సెప్టెంబర్ నాల్గో తేదీ నుంచి ఏడో తేదీ వరకు షాద్ నగర్ లోని మల్లికా కన్వెన్షన్ లో నిర్వహించనున్నట్లు సీపీఐ నాయకులు రామకృష్ణ తెలిపారు. కొండాపూర్, కొత్తగూడ, ఇజ్జత్ నగర్, తదితర ప్రాంతాల్లో మహాసభ జయప్రదం చేయాలని సీపీఐ నాయకులు కరపత్రాలను పంపిణీ చేశారు. సెప్టెంబర్ నాల్గో తేదీన భారీ ర్యాలీతో బహిరంగ సభను ప్రారంభించనున్నట్లు తెలిపారు. శేరిలింగంపల్లి మండలం నుంచి వేలాది మంది తరలివెళ్లి సీపీఐ ‌మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. 10వ తేదీ నుండి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వివిధ బస్తీల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కే. చందు యాదవ్, కె. వెంకటస్వామి, రంగారెడ్డి సిపిఐ పార్టీ కౌన్సిల్ సభ్యులు కె. కాసీం, ఇజ్జత్ నగర్ కార్యదర్శి ఇర్ఫాన్, సోఫా కాలనీ కార్యదర్శి రాములు, రాఘవేంద్ర కాలనీ కార్యదర్శి లింగయ్య, బీసీ హక్కుల పోరాట సంఘం కార్యదర్శి కే. సుధాకర్, ప్రజానాట్యమండలి కార్యదర్శి వెంకటేష్, కృష్ణ, కొండల్, బాలు, స్వామి, ఎం. శ్రీను, జె శీను, ఇసుక రాములు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ మహాసభల కరపత్రాన్ని పంచుతున్న శేరిలింగంపల్లి సీపీఐ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here