నమస్తే శేరిలింగంపల్లి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అందజేసిన మట్టి వినాయక ప్రతిమలను శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రామయ్య నగర్ లో కాలనీ వాసులకు పంపిణీ చేశారు. మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అని రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. మట్టి విగ్రహాలు పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మికతతో జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఆదిత్య కిరణ్, కుమార్, రవి యాదవ్, కర్ణాకర్, నరేందర్, కాలాదర్, కాశీ విశ్వనాథ్, సోమయ్య, రాజు యాదవ్, ఇస్మాయిల్, సామెల్, శ్యామ్, ప్రకాష్, స్థానిక అపార్ట్ మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు.