కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కొండాపూర్ చౌరస్తాలో శేరిలింగంపల్లి సీపీఐ నాయకులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రామకృష్ణ పాల్గొని పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఐ శేరిలింగంపల్లి మండల కార్యదర్శి శ్రీశైలం గౌడ్, ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె చందు యాదవ్, రవి, మహిళా సమాఖ్య బిపాషా, శీను పాల్గొన్నారు.
