శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ (PAC) గా నియమితులైన సందర్బంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి సన్మానించారు. నరేందర్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే గాంధీని సన్మానించారు.
అదేవిధంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయినేనీ చంద్రకాంత్ రావు, సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, కాశినాథ్ యాదవ్, పోశెట్టి గౌడ్, మంజుల, అల్లం మహేష్, సంతోష్ బిరాదర్ తదితరులు పాల్గొన్నారు.