శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ (PAC) గా నియమితులైన సందర్బంగా రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంగళవారం సచివాలయంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి గాంధీని అభినందించారు. గాంధీ చేపట్టిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, రఘునాథ్ యాదవ్, పృథ్వి గాంధీ తదితరులు పాల్గొన్నారు.