షిల్లాంగ్ ప‌ర్య‌ట‌న‌లో కార్పొరేటర్ శ్రీకాంత్

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జిహెచ్ఎంసి అధికారిక అధ్యయన పర్యటనలో భాగంగా మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ మున్సిపల్ బోర్డులోని వివిధ ప్రాతాలలో పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణలో అవలంబిస్తున్న విధి విధానాలను డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు, దొడ్ల వెంకటేష్, మంజుల రఘునాథ్ రెడ్డి, మాధవరం రోజాదేవి రంగారావుల‌తో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ ప‌రిశీలించారు.

అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేటర్ శ్రీకాంత్

ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ లో స్వచ్ఛ గ్రామంగా పేరొందిన మావ్లీనాంగ్ లో పర్యటించడం జరిగిందని, ఆసియాలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా గుర్తింపు పొందిన మావ్లీనాంగ్ లో గ్రామస్తులు పరిశుభ్రత కోసం అనుసరిస్తున్న విధి విధానాల గురించి వారిని అడిగి తెలుసుకోవడం జరిగిందని అన్నారు. అదేవిధంగా మేఘాలయ, షిల్లాంగ్ మున్సిపల్ బోర్డులోని వివిధ ప్రాతాలలో పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణలో అవలంభిస్తున్న విధి విధానాలను, పట్టణ అభివృద్ధి పద్ధతులు, పురపాలక సేవలపై అమలవుతున్న‌ ఉత్తమ పద్ధతులను సేకరించి, విజయవంతమైన పారిశుధ్య విధానాలను పరిశీలించి హైదరాబాద్ మహా నగరంలో అమలు పరిచేందుకు తమవంతు కృషి చేస్తామని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here