శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీకి చెందిన శివనందుని చైతన్యకి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్ఎఫ్ ఎల్‌వోసీ ద్వారా మంజూరైన రూ.5 లక్షల విలువైన పత్రాలను, మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీకి చెందిన ఈశ్వర్ కి మంజూరైన రూ.1 లక్ష విలువైన పత్రాలను బాధిత కుటుంబాలకి PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపదలో ఉన్న పేదలకు ఆపన్నహస్తం అందిస్తుందని, పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ యాదవ్, ప్రసాద్, సాంబశివరావు, శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాస్, DSRK ప్రసాద్, పురేందర్ రెడ్డి, సైదేశ్వర్, ప్రశాంత్, పూర్ణ, తదితరులు పాల్గొన్నారు.