-
చందానగర్ పోలీసుల ఆశ్రయంలో మూడేళ్ళ బాలుడు
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): తల్లిదండ్రుల నుండి తప్పిపోయిన ఓ మూడేళ్ళ బాలుడిని చందానగర్ పోలీసులు చేరదీశారు. తన తల్లిదండ్రుల వద్దకు చేరాలని చిన్నారి ఎదురు చూస్తున్నాడు. బాలుడి నుండి వివరాలు సేకరించాలని పోలీసులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ చిన్నారి తన వివరాలను చెప్పలేని స్థితిలో ఉన్నాడు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని రాఘవేంద్ర హోటల్ వద్ద 3 ఏళ్ల ఓ బాలుడు ఒంటరిగా తిరుగుతుండగా కొందరు వ్యక్తులు గుర్తించి ఆరా తీశారు. ఆ బాలుడు తన కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయాడన్న విషయం తెలుసుకున్న వారు అతన్ని పోలీసులకు అప్పగించారు. కాగా ఆ బాలుడు మాట్లాడలేకపోతున్నాడని, అతనికి 3 ఏళ్ల వయస్సు ఉంటుందని, ఒంటిపై ఆరెంజ్ కలర్ టీ షర్టు, ఎరుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని, ఎవరైనా గుర్తు పట్టదలిచినా, అతని కుటుంబ సభ్యులు, సంరక్షకుల వివరాలు తెలిసినా వెంటనే చందానగర్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 040-27853911 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చని అన్నారు.
గమనిక: బాలుడి తల్లిదండ్రులకు ఈ విషయం చేరేలా షేర్ చేయండి