బీపీ మండ‌ల దివ‌స్ కార్య‌క్ర‌మాన్ని వాడ‌వాడ‌లా జరుపుకోవాలి: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బిపి మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ జరిగిన రోజు నుండి మండల్ జయంతి వేడుకల వరకు మండల దివస్ కార్యక్రమాన్ని వాడవాడలా జరుపుకోవాలనిబీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. బీసీల హక్కుల కోసం వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన బిపి మండల్ చైర్మన్ గా మండల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింద‌న్నారు. ఈ కమిషన్ వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం అప్పటి ప్రభుత్వానికి 40 సిఫారసులు చేయడం జరిగింద‌ని, వాటిలో కొన్నింటిని మాత్రమే ప్రభుత్వం అమలు చేసింద‌న్నారు. నాడు బీసీల‌ అభివృద్ధి కోసం వెనుకబడిన తరగతుల కలలు నిజం చేయడం కోసం బీపీ మండల్ చాలా కృషి చేశారు. ఆయ‌న‌ కమిషన్ సిఫారసులను కొన్నింటిని మాత్రమే ప్రభుత్వం అమలుపరిచింది. వెనుకబడిన తరగతుల వారి కోసం బీపీ మండల్ చేసిన కృషిని మనందరం గుర్తుంచుకొని ఆయ‌న‌ని స్మరించుకొని ఆగస్టు 7వ తేదీ నుండి ఆయ‌న జయంతి వరకు మండల దివస్ ను వాడవాడలా వీధి వీధినా ప్రతి బీసీ వ్య‌క్తి పాల్గొని పండుగ‌లా జరుపుకోవాలని అన్నారు. బీసీ నాయకులు ముందడుగు వేస్తూ ప్రజలను బలోపేతం చేస్తూ ప్రజలకు, బీసీల‌కు రావాల్సిన హక్కులను కావలసిన స్వేచ్ఛను అన్ని రంగాలలో ఆర్థిక శ్రామిక విద్యా వైద్య రంగాలలో సాధించుకోవాలని అన్నారు. దీనికి పరిపూర్ణంగా బీపీ మండల్ సిఫారసులన్నింటిని అమలు చేస్తే సరిపోతుందని వాటికోసం కృషి చేయాలని అందరం ఐక్యం కావాలని అన్నారు. వచ్చే స్థానిక ఎలక్షన్లలో బీసీలకు వార్డ్ మెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి కార్పొరేటర్ కౌన్సిలర్లుగా ఎమ్మెల్యే ఎంపీ సీట్ల‌లో రిజర్వేషన్ కల్పించాల‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here