శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్లలో ఎంతో పురాతనమైన ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పునర్నిర్మాణ పనులను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జ్యుడిషియల్ జడ్జి అశోక్, పురం విష్ణువర్ధన్ రెడ్డి, గిరి, దయాకర్ యాదవ్, శంకర్, చిన్న, నరసింహ రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.







